13 May, 2026 | 1:32 AM

మైనార్టీ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలి

13-05-2026 12:02 AM

మైనార్టీ శాఖ మంత్రిని కోరిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు 

కామారెడ్డి, మే 12 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లో నీ మైనార్టీ పాఠశాలలు గురుకుల పాఠశాలలు అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ ను మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కలిసి విన్నవించారు. మైనార్టీ విద్యార్థుల భవిష్యత్తును లిస్టులో పెట్టుకుని నియోజకవర్గంలోని మైనార్టీ పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. మైనార్టీ విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్య అందాల నిర్లక్ష్యంతో ప్రభుత్వం మరింత సహకారం అందించాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కోరడంతో మంత్రి హజారుద్దీన్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. త్వరలోనే మైనార్టీ పాఠశాలలు గురుకుల పాఠశాలలు కళాశాలలకు మౌలిక వసతులకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపినట్లు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు తెలిపారు. మంత్రిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సన్మానించి అభినందించారు.