12 July, 2026 | 2:18 PM

Breaking News

ఔరంగజేబు సమాధి తొలగింపునకు ఫడ్నవీస్ మద్దతు

10-03-2025 11:50 PM

ముంబై: శంభాజీనగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలనే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు, బీజీపీ ఎంపీ ఉదయన్‌రాజే భోసలే డిమాండ్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శనివారం మద్దతు పలికారు. కాంగ్రెస్ పాలనలో ఔరంగజేబు సమాధి పురవాస్తు శాఖ పరిధిలోకి వెళ్లిందని, కాబట్టి సమాధి తొలగింపు ప్రక్రియ చట్ట ప్రకారం జరగాలన్నారు.

సమాజ్‌వాదీ పార్టీ నేత అబూ అజ్మీ ఇటీవల ఔరంగజేబు పాలనపై ప్రశంసలు కురిపించడంతో వివాదం మొదలైంది. అబూ అజ్మీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ఉదయన్ రాజే భోసలే, మాజీ ఎంపీ నవనీత్ రాణా తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే శంభాజీనగర్‌లోని ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.