27 August, 2026 | 2:20 PM

42వ డివిజన్‌ లో ఓపెన్ జిమ్ ఏర్పాటు

12-07-2026 01:46 PM

డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు

ముకరంపుర,(విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 42వ డివిజన్‌ భగత్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న 'ఓపెన్ జిమ్' పనులను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పరిశీలించారు.

ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ... కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ద్వారా కరీంనగర్ నగరానికి మొత్తం 18 ఓపెన్ జిమ్‌లు మంజూరు అయ్యాయని ఇందులో భాగంగానే 42వ డివిజన్‌లో ఈ అధునాతన ఓపెన్ జిమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే సదుద్దేశంతోనే ఈ జిమ్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సునీల్ రావు తెలిపారు.