ఫీజుల నియంత్రణలో విఫలం
రాష్ట్రంలో 2026--27 విద్యా సంవత్సరానికి సంబంధించి కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల మోత మోగిస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో అప్పుడే అడ్మిషన్లు పూర్తయిపోయినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని జీవోలు, నిబంధనలు రూపొందించినా కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల దోపిడీ ఆగడం లేదు. ప్రైవేట్, స్కూళ్లలో ఫీజులు నియంత్రిస్తామని ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది.
రాష్ట్రంలో ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నా విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. సర్కారు నిబంధనలను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా నడుస్తున్న పాఠశాలల వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం శోచనీయం. యూనిఫాంలు, పుస్తకాలు, నోట్‌బుక్‌ల పేరిట కూడా దోపిడీ జరుగుతున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి.
జూపల్లి దీపికా, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి






