18 June, 2026 | 1:30 AM

జెన్ జీకి సమాధానమివ్వరా?

18-06-2026 12:00 AM

ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, రైతు ఆదాయం డబుల్ చేయడం, నల్లధనం నిర్మూలన, అవినీతికి చెక్ పెట్టడంతో పాటు దేశాన్ని ‘విశ్వగురు’గాతీర్చిదిద్దుతామని 2014 ఎన్నికల ముందు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ పలు హామీలు ఇచ్చారు. కేంద్రంలోనే కాదు, రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ అధికారంలో ఉంటే ‘డబుల్’ వేగంతో దూసుకెళ్లవచ్చని ఎన్డీయేను బలపరిచి మద్దతివ్వాలని కమలనాథులు కోరారు. చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు.

కానీ, నాటి హామీల అమలు నీటిమూటలయ్యాయి. బీజేపీ తన సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రజల దృష్టిని, దృక్కోణాన్ని ఎప్పటికప్పుడు మారుస్తోంది. అయితే, జెన్ జీ యువత మాత్రం వాస్తవాలను వెలికితీస్తూ.. సర్కారును తూర్పార పడుతున్నారు. ఆధారాలతో సహా నెట్టింట కడిగిపారేస్తున్నారు. వారు సంధిస్తున్న ప్రశ్నలకు కేంద్ర పాలకుల వద్ద సమాధానమే లేదు. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలలో కేంద్ర పట్ల తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.

‘ధరాఘాతం’ వల్ల సామాన్యుడి నడ్డీ విరుగుతున్నది. అదే స్థాయిలో ఆదాయం పెరగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ పన్నెండేళ్లలో మోదీ ప్రభుత్వం సామా న్య, మధ్యతరగతి ప్రజల మేలుకు చేసిన పనులేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జవాబుదారీతనంతో కేంద్రం వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

 అంబీర్ శ్రీకాంత్, 81859 68059