శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ సీఐఎస్‌ఎఫ్ జవాన్ అరెస్ట్
- అనుమానాస్పదంగా గమనించి అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సోషల్ మీడియా ద్వారా మరిన్ని మోసాలకు ప్రయత్నం వెలుగులోకి
శంషాబాద్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ యూనిఫామ్ ధరించి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను ఆర్జీఐఏ పోలీ స్ స్టేషన్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి గతంలో ఒక యువతిని ప్రేమించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరి వివాహం జరగలేదు. అనంతరం బాలకృష్ణ మరో మహిళను వివాహం చేసుకుని తరువాత విడాకులు తీసుకున్నాడు.
ఇదే సమయంలో అతను ప్రేమించిన యువతి కూడా విడాకులు పొం దడంతో, ఇద్దరూ మళ్లీ పరిచయమై వివాహానికి సిద్ధమయ్యారు. కానీ యువతి తల్లిదం డ్రులు ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే పెళ్లికి అంగీకరిస్తామని షరతు విధించడంతో, బాలకృష్ణ మోసపూరితంగా ప్రవర్తించాడు. శం షాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుని సిఐఎస్‌ఎఫ్ యూనిఫామ్ ధరించి ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను యువతికి పంపించి, తనకు సెంట్రల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేశాడు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న బాలకృష్ణను గమనించిన ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. సిఐఎస్‌ఎఫ్ యూనిఫాంను దుర్వినియోగం చేస్తూ ఎయిర్‌పోర్టులో హల్చల్ చేస్తున్నాడని గుర్తిం చి కేసు నమోదు చేశారు. ఇంకా విచారణలో బాలకృష్ణ ఫేస్‌బుర్, ఇన్‌స్టాగ్రాం వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా యువతులను మోసం చేయడానికి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు వెల్లడైంది. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.






