25 August, 2026 | 3:15 AM

నకిలీ పత్తి విత్తనాల గుట్టురట్టు.. 65 ప్యాకెట్లు స్వాధీనం

19-06-2026 01:36 AM

నూతనకల్ మండలంలో వాహన తనిఖీల్లో పోలీసులు 65 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

నూతనకల్, జూన్ 18: మండల పరిధిలోని పెదనెమిల శివారులో ఎస్‌ఐ నాగరాజు వ్యవసా య శాఖాధికారులతో కలిసి  నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ నాగరాజు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గుండెపూడి గ్రామానికి చెందిన బోడపట్ల యాకస్వామి(32) అనే వ్యక్తి టీఎస్26-5651 నంబర్ గల హీరో గ్లామర్ మోటార్ సైక్పిఅనుమానాస్పదంగా వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నామన్నారు.

సైబర్ మరియు క్రైమ్ వార్తల కోసం Crime News చూడండి

అతని వద్ద తనిఖీ చేయగా,‘అరుణోదయ‘ లేబుల్ కలిగిన 65 ప్యాకెట్ల నకిలీ పత్తి విత్తనాలు (ఒక్కోటి 450 గ్రాములు) లభ్యమయ్యాయని,వీటితోపాటు విత్తనాల విక్రయానికి వినియోగించిన ఒక మొబైల్ ఫోన్,మోటార్ సైకిల్ మరియు ఒక టాటా ఏస్ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

స్వాధీనం చేసుకున్న విత్తనాలను తదుపరి పరీక్షల నిమిత్తం వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించి, నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ అక్రమ రవాణాలో సంబంధం ఉన్న నందిగామకు చెందిన రాంబాబు అనే మరో వ్యక్తిని గుర్తించామని, త్వరలోనే అతడిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని సూర్యాపేట ఎస్పీ మరియు డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

రాష్ట్ర వార్తల కోసం Telangana News చూడండి

Q: ఎక్కడ నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి?
👉 సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో.

Q: ఎంత పరిమాణంలో విత్తనాలు స్వాధీనం అయ్యాయి?
👉 65 ప్యాకెట్లు (ప్రతి ప్యాకెట్ 450 గ్రాములు).

Q: పోలీసులు ఏమి చర్యలు తీసుకున్నారు?
👉 నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

“నకిలీ విత్తనాలపై రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు”

మరిన్ని బ్రేకింగ్ న్యూస్ కోసం మా విజయక్రాంతి న్యూస్‌ హోమ్‌పేజీని ఫాలో అవ్వండి.