19-12-2025 01:01:32 PM
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలోని(Nizamabad district) వర్నిలో నకిలీ నోట్ల కలకలం రేగింది. బాలాపూర్ రైతు కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ కట్టడానికి వెళ్లాడు. రైతు తీసుకువచ్చిన డబ్బులో రూ. 45 వేల విలువైన నకిలీ నోట్లను అధికారులు గుర్తించారు. బ్యాంక్ మేనేజర్ నకిలీ నోట్ల విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.