19-12-2025 01:39:39 PM
హైదరాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బంద్ కొనసాగుతోంది. అఖిలపక్షం పిలుపు మేరకు ఎల్లారెడ్డిలో బంద్ కొనసాగుతోంది. ఎల్లారెడ్డిలో వ్యాపార, విద్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నాయి. సోమార్ పేట్ లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థిపై దాడికి నిరసనగా బంద్ చేశారు. గెలిచిన సర్పంచ్ తమ్ముడి ట్రాక్టర్ దాడిలో గాయపడిన ఐదుగురికి చికిత్స అందిస్తున్నారు. సర్పంచ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడిపై కేసులు పెట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు.