19-12-2025 02:11:46 PM
హైదరాబాద్: లష్కర్ కార్పొరేషన్( Lashkar Corporation) ఏర్పాటు చేయాలని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్ దీక్ష చేస్తోంది. లష్కర్ జిల్లా సాధన సమితి(Lashkar District Achievement Committee) ఆధ్వర్యంలో ధర్నాచౌక్ లో దీక్షకు దిగింది. దీక్షలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav), ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
200 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్(Secunderabad) ప్రాంతాన్ని కార్పొరేషన్ గా చేయాలని స్థానికులు డిమాండ్ అన్నారు. మా ప్రాంత ఆదాయాన్ని స్థానిక అభివృద్ధికే ఖర్చు చేయాలని ప్రజల కోరికన్నారు. ఈ పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తలసాని(Talasani) హామీ ఇచ్చారు. డివిజన్ల విభజన కూడా శాస్త్రీయంగా జరగలేదని ఆయన ఆరోపించారు. మేయర్ కు కూడా తెలివకుండా డివిజన్ల విభజన చేయటం సిగ్గుచేటని తలసాని విమర్శించారు.