19-12-2025 02:21:15 PM
హైదరాబాద్: ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme) పేరు మార్పును వ్యతిరేకిస్తూ టీపీసీసీ నిరసనలు చేపట్టనుంది. శనివారం నాడు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital) వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుంది. ఆదివారం నాడు టీపీసీసీ ఆధ్వర్యంలో జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ(All India Congress Committee) పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud) పిలుపునిచ్చారు. కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనల్లో పాల్గొని బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని కోరారు.