19-12-2025 01:30:54 PM
ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్
కుమ్రంభీంఅసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలం చిలాటి గూడ గ్రామపంచాయతీ(Chilati Guda Gram Panchayat) ఎస్టీ రిజర్వు కావడంతో పంచాయతీ పరిధిలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు లేకపోవడం వల్ల ఒక నామినేషన్ కూడా పడలేదు. దీంతో ఉప సర్పంచ్ కు పోటీ నెలకొంది. ఉప సర్పంచ్ గా అయ్యి పంచాయతీ పాలనను చేతిగుప్పిట్లో ఉంచుకోవాలని భావించిన మాజీ సర్పంచ్ మహేష్ ఈ ఎన్నికల్లో వార్డు సభ్యునిగా ఎన్నికల బరిలో నిలిచిండి ఓటమి చెందాడు. దీంతో ఆయన అనుకున్న ప్రణాళిక విఫలం కావడంతో వార్డు లో ఓటర్లకు పంచిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఇంటింటికి తిరుగుతూ డిమాండ్ చేశారు. గత్యంతరం లేక కొంతమంది ఓటర్లు డబ్బులు తిరిగి ఇవ్వగా మరి కొంతమంది ఆయనపై గొడవకు దిగారు.