సీఎం కప్ పోటీలను ప్రారంభించిన కలెక్టర్
భద్రాచలం (విజయక్రాంతి): సీఎం కప్-2024 మండల స్థాయి పోటీలను మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ భద్రాచలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నందు ప్రారంభించడం జరిగింది. వాలీబాల్, కోకో, కబడ్డీ, ఫుట్బాల్, అథ్లెటిక్స్ క్రీడలను ఈ సందర్భంగా ప్రారంభించారు. ఈ పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. క్రీడాకారులు ఈ పోటీలలో ప్రతిభ చూపి, రాష్ట్రస్థాయిలో కూడా మెడల్స్ సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ స్పోర్ట్స్ ఆఫీసర్, ఎం పరంధామ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఎంఈఓ, డి ఎల్ పి ఓ భద్రాచలం గ్రామపంచాయతీ ఈవో శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీవి రామిరెడ్డి పాల్గొన్నారు.






