6 May, 2026 | 7:19 PM

కులర్ కరెంట్ షాక్‌తో బాలుడికి గాయాలు

06-05-2026 06:44 PM

పరామర్శించిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): మండలంలోని బనార్ గొంది గ్రామంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఒక బాలుడు గాయపడ్డాడు. గ్రామానికి చెందిన ఆత్రం మారు కుమారుడు ఆత్రం అజయ్ తన ఇంట్లో కూలర్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం అతడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ వెంటనే జిల్లా ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు.

అజయ్‌కు అందుతున్న ప్రథమ చికిత్సను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం డ్యూటీలో ఉన్న వైద్యులతో మాట్లాడి బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. ఆందోళనలో ఉన్న బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అజయ్‌కు వైద్యం అందుతోందని, ప్రమాదం ఏమీ లేదని వైద్యులు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నాయకులు  ఉన్నారు.