21 June, 2026 | 1:36 AM

మాపై తప్పుడు ప్రచారం

21-06-2026 12:00 AM
  1. హెచ్‌సీఏ, విశాఖ వివాదంపై మంత్రి వివేక్ ప్రకటన
  2. సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసును వక్రీకరిస్తున్నారు

హైదరాబాద్, జూన్ 20 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ), విశాఖ ఇం డస్ట్రీస్ మధ్య రూ.68.73 కోట్ల కేసులో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని తెలంగాణ మంత్రి జి. వివేక్ స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తప్పుడు ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణానికి సంబంధించి విశాఖ రూ.4.32 కోట్లు ఆర్థిక సాయం అం దించింది. అయితే 2008 తర్వాత వివాదం తలెత్తడం, హెచ్‌సీఏ ఒప్పందాన్ని 2011లో రద్దు చేయడం జరిగాయి.

దీనిపై విశాఖ ఇం డస్ట్రీస్ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించగా అనుకూలంగా తీర్పు వచ్చింది. రూ.69.73 కోట్లు హెచ్‌సీఏ విశాఖకు చెల్లించాలని తీర్పు వచ్చిందని వివేక్ గుర్తు చేశారు. అయితే ఇప్పటి వరకూ హెచ్‌సీఏ నుంచి తమ కంపెనీకి ఎలాంటి చెల్లింపులు జరగలేదని స్పష్టం చేశారు. అయితే కొంతమంది వ్యక్తులు ఈ వివాదంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారనీ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఇప్పటికే పరువు నష్టం నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు.