భారత్‌కు సఫారీ సవాల్
21-06-2026 12:00 AM
మహిళల టీ20 ప్రపంచకప్
మాంచెస్టర్, జూన్ 20 : మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు అసలు సిసలు సవాల్‌కు సిద్దమైంది. మాంచెస్టర్ వేదికగాఆదివారం సౌతాఫ్రికా మహిళలతో తలపడబో తోంది. ప్రస్తుతం రెండు విజయాలతో గ్రూ పులో అగ్రస్థానంలో ఉన్న భారత మహిళల జట్టుకు సఫారీ జట్టు గట్టిపోటీనివ్వడం ఖా యం. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, రిఛా ఘోష్ ఫామ్‌లో ఉన్నారు. అటు బౌలింగ్ లో దీప్తి శర్మ , శ్రీచరణి కూడా అదరగొడుతున్నారు. మాంచెస్టర్ పిచ్ స్పిన్ +కు అనుకూ లించే అవకాశం ఉండడంతో స్పిన్న ర్లే కీలకం కాబోతున్నారు.మరోవైపు దక్షిణాఫ్రికా జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. మెగా టోర్నీల్లో సఫారీలు చాలా ప్రమాదకరమైన ప్రత్యర్థులుగా చెప్పొచ్చు.






