21 April, 2026 | 5:12 PM

Breaking News

రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •   అంగన్వాడీలో పోషక అభియాన్   •   ఇంటర్మీడియట్ మండల టాపర్ హారికను అభినందించిన పోలీసులు   •   మోదీ.. ఒక ఉగ్రవాది.. మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు   •   మేం ఏం చేసినా అడిగే వారెవ్వరు   •   కెసిఆర్ మెల్లకుంట తండాను జీపీగా ఏర్పాటు చేయకుంటే పట్టించుకునే నాదుడే ఉండేవాడు కాదు   •   రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ధ్వేయం..   •  

నిగమ ఇంజనీరింగ్ కళాశాలలో అట్టహాసంగా సౌరంగా పర్వం-2025 వేడుకలు

26-06-2025 10:14 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): నిగమ ఇంజనీరింగ్ కళాశాల(Nigama Engineering College)లో గురువారం రోజున ఎంబీఏ రెండవ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ బివీఆర్ గోపాల్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... మన కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం చేయడం కాదు పది మందికి ఉద్యోగం కల్పించే విధంగా ఉండాలని ఆకాంక్షించారు.

తదుపరి జాయింట్ సెక్రటరీ రత్న గోపాల్ మాట్లాడుతూ.. కష్టపడి చదువుతూ అనుకున్నది సాధించాలని, ఎంత కష్టమొచ్చిన చదువును వదులుకోవద్దు అని విద్యార్థులకు సూచించారు. వీడ్కోలు వేడుకలో విద్యార్థుల సాంసృతిక కార్యక్రమలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంబీఏ హెచ్ఓడి వహీద్, వాగేశ్వరీ విమెన్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రమణ చారి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.