11 March, 2026 | 7:39 PM

గుంజపడుగు జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో అలరించిన వీడ్కోలు సమావేశం

11-03-2026 05:41 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని గుంజపడుగు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో నేడు పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, మంథని మండల విద్యాధికారి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తు ప్రగతికి తొలి మెట్టు పదవ తరగతి పరీక్షలు కాబట్టి ఏకాగ్రతతో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ పరీక్షలలో ప్రతిభ చాటాలని కోరారు.

క్రమశిక్షణ విద్యార్థి జీవన విధానానికి దిక్సూచి పని చేస్తుందని క్రమశిక్షణ తో భవిష్యత్ లో మంచి విజయాలు సాధించాలని కోరారు. వేంపాడు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన కొండల్ రెడ్డి అనే ఉపాధ్యాయున్ని సన్మానించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమానికి అతిథి లుగా ముత్తారం మండల విధ్యాధికారి హరిప్రసాద్, గ్రామ ఉపసర్పంచ్ లక్ష్మి సదానందం ఉపాధ్యాయులు సురేష్, రవి, సంగీత, భూమయ్య, స్వామి, రవీందర్, నరేందర్, సతీష్ రెడ్డి, సమ్మయ్య,  విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.