చీపురు పట్టిన జిల్లా కలెక్టర్
11-03-2026 05:44 PM
లక్ష్మణ చందా,(విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలో బుధవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చీపిరి పట్టి రోళ్లను ఉర్సి శుభ్రం చేశారు. పోట్టపల్లి గ్రామంలో కలెక్టర్ తో పాటు డిపిఓ మండల అధికారులు రోడ్లపై ఉన్న చెత్తను చీపిర్లతో శుభ్రం చేశారు. కలెక్టర్ స్వయంగా చీపిరి పట్టడంతో అక్కడ ఉన్న అధికారులు గ్రామస్తులు గ్రామ పరిసరాలని పరిశుభ్రంగా మార్చుకుంటామని శపథం చేశారు . ఈ కార్యక్రమంలో డిపిఓ శ్రీనివాస్ అధికారులు ఉన్నారు




