1 July, 2026 | 1:25 AM

పదవీ విరమణ పొందిన పోలీసు సిబ్బందికి వీడ్కోలు

01-07-2026 12:36 AM

సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్ సత్కారం

శేరిలింగంపల్లి, జూన్ 30 (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం 14 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పదవీ విరమణ పొందారు. సీపీ డాక్టర్ ఎం.రమేష్ వారిని శాలువాలతో సత్కరించి,పెన్షన్ పత్రాలు,జ్ఞాపికలు అందజేశారు.పదవి విరమణ పొందిన వారిలో అన్ని శాఖల పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

ఈ సందర్భంగా సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ.. ఈ అధికారులు,సిబ్బంది సుదీర్ఘ కాలం పోలీసు శాఖకు అంకితమైన సేవలందించి, ప్రజల భద్రత, సమాజ సేవలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వారి సేవలు యువతకు ఆదర్శప్రాయమని అన్నారు. కుటుంబ సభ్యుల త్యాగం అభినందనీయమని, పదవీ విరమణ తర్వాత విశ్రాంత జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీసీపీలు అన్నపూర్ణ, సుధీంద్ర, ముత్యం రెడ్డి, సంజీవ్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.