18 August, 2026 | 1:00 AM

యూరియా ఏదయ్యా?

18-08-2026 12:00 AM
  1. ఎరువుల కోసం అన్నదాత సతమతం
  2. ఆన్‌లైన్ బుకింగ్‌తో ఆందోళన
  3. తరచూ రొడ్డెక్కుతున్న రైతన్నలు

గంభీరావుపేట,ఆగస్టు17(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు రోజుకో చోట ఆం దోళనకు దిగుతున్నారు.సిరిసిల్ల జిల్లాలో యూరియా కొరత ఆన్లైన్ బుకింగ్ సమస్యలపై ఇటీవల రైతులు గంభీరావుపేట మండ లం కొత్తపల్లి సహకార సంఘం ఎదుట రై తులు ఆందోళన కు దిగడమే కాకుండా సొ సైటీ కి తాళం వేశారు. ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ సమయంలో స్టాక్ కనిపించకపోవడం , సర్వర్ సమస్యలతో రైతు లు ఇబ్బంది పడుతున్నారు.

నియమిత సమయానికి యూరియా అందకపోవడంతో ఆగ్రహించిన రైతులు కొత్తపల్లిలోని సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ లో సైతం రైతులు రోడ్డెక్కారు. సొసైటీ నిర్వాహకులు ప్రకటించే టైంకు ముందే రైతులు ఫోన్లు పట్టుకుని బుకింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే సమ యం వచ్చిన తర్వాత బుకింగ్ చేసేందుకు ప్రయత్నించినా యూరియా బుక్ కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంటలకు సరిపడా యూరియా లభించడం లేదని, అసలైన రైతులకే యూరియా అందని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సౌకర్యం కల్పించాల్సిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ తమకు మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోందని ఆరోపిస్తున్నారు.యాప్లో ఒకసారి గరి ష్ఠంగా రెండు బస్తాల యూరియా మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేసే రైతులు పలుమార్లు బుకింగ్ చేసుకోవాల్సి వస్తోంది.

యూరియా కోసం పదేపదే సొసైటీలు, డీలర్ల వద్దకు వెళ్లాల్సి రావడంతో వ్యవసాయ పనులు కూడా వదులుకోవాల్సి వస్తోంది.మరోవైపు రిటైల్ డీలర్ల వద్ద యూరియా అందుబాటులో లేకపోవడం, సహకార సంఘాల్లో తగినంత నిల్వలు లేకపోవడం కూడా సమస్యకు కారణమవుతున్నాయి. రెండు బస్తాల సీలింగ్ ప్రకారం సీజన్ మొత్తానికి తమకు కేటాయించే యూరియా కోటాను ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

యాప్ బుకింగ్లో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, రైతులకు సరిపడా యూరియాను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. అధికారులు మాత్రం జిల్లాలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, యాప్లో సాంకేతిక సమస్యలను రిఫ్రెష్ చేసుకోవాలని సూచిస్తున్నారు.