18 August, 2026 | 1:01 AM

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లను కొనసాగించాలి

18-08-2026 12:00 AM

ముషీరాబాద్,ఆగస్టు 17(విజయక్రాంతి): పేదల సంక్షేమం కోసం మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్‌ఎస్ నేతలు ముషీరాబాద్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించా రు. ఎమ్మెల్యే డాక్టర్ ముఠా గోపాల్, ఎమ్మె ల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో నాయకులు రోడ్డుపై బై ఠాయించి ప్లకార్డులు చేత బూని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ముఠా గోపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల ను రద్దు చేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరో సా కల్పించే పథకాలను ఎలాంటి ఆటంకా లు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ పథకాల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.నిరసన కారణంగా ముషీ రాబాద్ చౌరస్తా నుంచి గాంధీ ఆసుపత్రి వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వా హనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పోలీసులు నిరసనకారులను పక్కకు తరలించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.

ఈ కా ర్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, మీడియా ఇంచార్జి ముచ్చకుర్తి ప్రభాకర్, నాయకులు అధ్యక్షులు వై. శ్రీ నివాసరావు, శ్రీధర్రెడ్డి, బింగి నవీన్, శంకర్ ముదిరాజ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్యా మ్ యాదవ్, దీనదయాల్ రెడ్డి, డి. శివముదిరాజ్, టి. సోమన్, తలారి శ్రీకాంత్ ముది రాజ్, సుధాకర్ గుప్తా, మహ్మద్ అలీ, బొట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మేడిపల్లి ఎమ్మార్వో కార్యాలయం ఎదుట

మేడిపల్లి: తెలంగాణ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డకు ప్ర భుత్వo పెళ్లి కానుకగా, కెసిఆర్ నాయకత్వం లో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యా ణ లక్ష్మి షాదీ ముబారక్ ల పథకాలను కాం గ్రెస్ సర్కార్ ఆపేసే కుట్ర జరుగుతుందని ఆ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని కో రుతూ మేడిపల్లి ఎమ్మార్వో కార్యాలయం ముందు బోడుప్పల్, పీర్జాదిగూడ బిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సోమవారం బోడుప్పల్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి మంద సం జీవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు , మహిళలు పాల్గొని కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మాజీ మేయర్ సామల బుచ్చిరెడ్డి, బో డుప్పల్ బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మీ సాల కృష్ణ, ఫిర్జాదిగూడ బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి రఘు వర్ధన్ రెడ్డి, బోడుప్పల్, పీర్జాదిగూడ మాజీ కార్పొరేటర్లు, బి ఆర్ ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

జవహర్ నగర్ మాజీ మేయర్

జవహర్ నగర్: కల్యాణ లక్ష్మి షాది ముబారక్ పథ కాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేయాలని చూ డడం దారుణమని యావ త్ తెలంగాణ ఆడబిడ్డలను అవమానించినట్టేనని జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య మండిపడ్డారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన కళ్యా ణ లక్ష్మి షా దీ ముబారక్ పథకాలను అమ లు చేయకుం డా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు కలిగించడానికి నిరసిస్తూ ఉమ్మ డి జవహర్ నగర్ లోని మాజీ మేయర్ మేకల కావ్య ఆధ్వర్యం లో సోమవారం ప్రజా పరిపాలన కార్యాల యం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.  ఈ కార్యక్ర మం లో జిట్టా శ్రీనివాసరెడ్డి సుధాకర్ చారి, ప్రసాద్, పంతంగి సి ద్ధులు యాదవ్, వెంకటేష్, అహ్మద్ పాషా, లక్ష్మణ్, ఎల్ల స్వామి, నరసింహ, మహేష్ యాదవ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ ..

సికింద్రాబాద్: కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఓల్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. సోమవారం బిఆర్‌ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఓల్ బోయిన్పల్లి బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం నుంచి హస్మత్ పేట్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వరకు ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సుమారు మూడు వందల మం దితో ర్యాలీ నిర్వహించి, అనంతరం ధర్నా చేపట్టారు.

ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షులు సయ్యద్ ఇజాజ్, డివిజన్ అధ్యక్షులు ఇర్ఫాన్, సెక్రటరీ హరినాథ్, గడ్డం నర్సింగ్ రావు, మహిళ అధ్యక్షురాలు లలిత గౌడ్, ఖదీర్, సీనియర్ మహిళా నా యకురాళ్లు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 ఎల్బీనగర్‌లో బీఆర్‌ఎస్  నాయకుల ఆందోళన 

ఎల్బీనగర్ : సంక్షేమ పథకాలను ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, కాంగ్రెస్ కుట్రను అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ మహిళా నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఎల్బీనగర్ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు.ఈకార్యక్రమంలో బీఆర్‌ఎస్ ఎల్బీనగర్ నియోజక వర్గం మహిళా అధ్యక్షురాలు రంగేశ్వరి నా యుడు, మహిళలు శైలజ, రమాదేవి, దేవి, రాధిక, విజయ లక్ష్మి, శ్రీలత, కల్పన, వసంత, లక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు.

 శేరిలింగంపల్లిలో బీఆర్‌ఎస్ ర్యాలీ

శేరిలింగంపల్లి: హైకోర్టు విధించిన స్టే నేపథ్యంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకా లు కొనసాగాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ శ్రేణు లు సోమవారం శేరిలింగంపల్లిలో ర్యాలీ నిర్వహించారు.పీజేఆర్ స్టేడియం నుంచి ఎన్హెచ్-65 వరకు జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళలు పాల్గొని పేద ఆడబిడ్డల పెళ్లి సాయం తక్షణం పునరుద్ధరించాలని కోరారు.ఆగస్టు 12న హైకోర్టు ఈ పథకాలపై మధ్యంతర స్టే విధించడంతో నిధుల విడుదల నిలిచింది.

ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పథకాలు కొనసాగుతాయని, కోర్టులో స్టే ఎత్తివేయించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ ర్యాలీలో రాజన్న, ప్రకాష్, సలీం, ప్రమోద్,చందర్ రావు, నగేష్ రెడ్డి, శభన, అంజి యాదవ్,శేఖర్ ముదిరాజ్, బాబా, సు నీత,అనంత రెడ్డి,మల్లేష్,ఉపేందర్,ముజాహిద్,గిరి, మొదలగు ముఖ్య నాయకులు, మహిళలు, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-బీఆర్‌ఎస్ అధ్యక్షుడు రామిడి రాం రెడ్డి.. 

 బడంగ్ పేట్: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను తక్షణమే అమలు చేయాలని బడంగ్ పేట్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రా మిడి రాం రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల నిలుపుదలపై బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వ ర్యంలో బాలాపూర్ మండల కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పెద్దబావి ఆనంద్ రెడ్డి పెద్దబావి శ్రీనివాస్ రెడ్డి పుట్టగల్ల సంతో ష్ కుమార్, ఎర్రబట్టు శ్రీనివాస్ రాజ్,గట్టు మైపాల్, పెద్దబావి మహేందర్ రెడ్డి, కర్రె బ ల్వంత్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం: ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

 కుత్బుల్లాపూర్, ఆగష్టు 17(విజయక్రాంతి): నిరుపేదలకు సంక్షేమ పథకాలు అం దించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్ర భుత్వమేనని బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ఆరోపించారు. కళ్యాణ ల క్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే విధిస్తూ ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చే యాలని సూచించిన ప్రభుత్వం తమ నిర్లక్ష్య వైఖరితో కౌంటర్ దాఖలు చేయకుండా సం క్షేమ పథకాలకు స్వస్తి పలికేలా ప్రభుత్వం వ్య వహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం కుత్బుల్లాపూర్ జోనల్ కార్యాలయం ముందు బిఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని మీడియా ముఖంగా ఎండగట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు, 12 డిక్లరేషన్లు, 420 హామీలతో అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికిల పడ్డ దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు.

కెసిఆర్ సర్వజనహితం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడంలో ప్రభు త్వం ఘోరంగా విఫలమైందని పేర్కొన్నారు. మేం అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మి తో పాటు తులం బంగారం ఇస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నీ తులం బంగా రం ఏమైంది, ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. 

కొత్త పెన్షన్లకు ఇప్పటికే పదుల సార్లు దరఖాస్తులు తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. 19 దరఖాస్తులు వస్తే ఒక పెన్షన్ కూడా మంజూరు చేయలేని అసమర్ధ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, దీనికి తోడు మళ్లీ దరఖాస్తులు పెట్టమని ప్రజలను వేధిస్తున్నారని అన్నారు.