2 July, 2026 | 10:50 AM

Breaking News

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •   కాంట్రాక్ట్ పనులను పంచాయతీ సిబ్బందితో చేయించడం తగదు   •   పిచ్చికుక్క వీరంగం.. 10 మందికి తీవ్రగాయాలు.!   •   సిర్గాపూర్ పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్‌వో   •   నకిలీ అక్రెడిటేషన్ కార్డు విషయమై పోలీసులకు ఫిర్యాదు   •  

అందాల తారలకు వీడ్కోలు

02-06-2025 01:35 AM
  1. సాంస్కృతిక కార్యక్రమాలతో సెండాఫ్ 
  2. సెల్ఫీలతో అలరించిన మిస్ వరల్ పోటీదారులు 

రాజేంద్రనగర్, జూన్ 1: మిస్ వరల్ పోటీల్లో పా ల్గొన్న అందాల తారలు తమ స్వదేశాలకు వెళ్ళిపోయా రు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక శాఖ, టూ రిజం శాఖ ఆధ్వర్యంలో వారికి ఆదివారం సాయంత్రం ఘనంగా వీడ్కోలు పలికారు. సాంప్రదాయపద్ధంగా కూచిపూడి నృత్యాలతో అమ్మాయిలు వారిని ఎంతో ఘ నంగా సాగనంపారు. సాంస్కృతిక నృత్యాలను చూసి అందాల తారలు అబ్బురపడ్డారు.

ఈ సందర్భంగా వారు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. సెల్ఫీలు కూడా తీసుకున్నారు. గుడిమల్కాపూర్ లోని కురుగంటి కళాక్షేత్రం రాధిక శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. అనంతరం వారిని అధికారులు అభినందించారు. తెలంగాణలోని హైదరాబాదులో మిస్ వరల్ పోటీల నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అందాల తారలు తరలి వచ్చిన విషయం తెలిసిందే.