2 July, 2026 | 11:56 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

అత్యుత్తమ సేవలకు రాష్ట్రస్థాయి సేవా పథకాలు

02-06-2025 01:34 AM

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి,జూన్ 1 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ లోని వివిధ విభాగాలలో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రతిష్టాత్మకంగా అందించే ఉత్తమ సేవా పథకాలు జిల్లా పోలీసులకు అందించనున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం తెలిపారు. కామారెడ్డి జిల్లా  నుండి 17 మంది పోలీసు అధికారులకు ఈ ఉత్తమ సేవా పథకాలకు అర్హులయ్యారు అని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఒకరికి ఉత్తమ సేవా పథకం, 16 మందికి సేవ పథకాల కు ఎంపిక అయ్యారు. ఉత్తమ సేవా పథకం కే లింగయ్య ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ కామారెడ్డి, సేవా పథకాలు  పొందిన అధికారులు ఇన్స్పెక్టర్ సి సి ఎస్ ఎస్ శ్రీనివాస్, ఎస్త్స్ర బిక్నూర్ దత్తాత్రేద్రి గౌడ్, ఎస్ ఐ కామారెడ్డి ఏ శ్రీనివాస్, ఏ ఆర్ ఎస్ ఐ సత్యనారాయణ రెడ్డి కామారెడ్డి,ఎ అర్ హెడ్ కానిస్టేబుల్ నారాయణ,

కానిస్టేబుల్ గాంధారి రవికుమార్, కానిస్టేబుల్ సిసిఎస్ కిషన్, ఎ ఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్,కానిస్టేబుల్  ఎస్‌ఐ దోమకొండ సుబ్రహ్మణ్య చారి ఏఎస్‌ఐ మాచారెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎస్‌ఐ బిచ్కుంద శంకర్హెడ్ కాన్స్టేబుల్ రామారెడ్డి కృష్ణమూర్తి,ఎ అర్ హెడ్ కానిస్టేబుల్ సత్యం గౌడ్, కానిస్టేబుల్ ఎస్బిఐ లక్ష్మణరావు, కానిస్టేబుల్ దేవేందర్ పోలీస్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, లు ఎన్నికయ్యారని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని పోలీసు అధికారుల సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి పురస్కారాలను ప్రకటించడం జిల్లాకు గర్వకారణం అని ఇది పోలీస్ శాఖ పనితీరు అధికారుల నిబద్ధత సేవా తత్పరతకు ప్రతికలుగా నిలుస్తుంది అని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి పురస్కారాలను కోసం ఎంపికైన అధికారులను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  అభినందించారు.