5 June, 2026 | 10:34 PM

అగ్నికి ఆహుతైన టేకు వనం

05-06-2026 09:41 PM

 ప్రభుత్వ సాయానికి రైతు విజ్ఞప్తి

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు 3.12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టేకు వనం పూర్తిగా దగ్ధమైం ద ని బాధిత రైతు కొండి కొమరయ్య శుక్రవారం తెలిపారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... 16 సంవత్సరాల క్రితం సుమారు రూ.40 లక్షల పెట్టుబడితో తన వ్యవసాయ భూమిలో 2,300 టేకు మొక్కలను నాటా ను. ఎన్నో ఏళ్లుగా సంరక్షిస్తూ పెంచుకున్న ఈ టేకు వనం గురువారం రాత్రి అకస్మాత్తుగా చెలరేగిన మంటల కారణంగా పూర్తిగా కాలిపోయింది.

అగ్నిప్రమాదానికి గల కారణాలు  తెలియద నీ చెప్పారు. ఈ ఘటనలో సుమారు రూ.1 కోటి మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. జీవితకాల శ్రమతో పెంచుకున్న టేకు వనం క్షణాల్లో బూడిద కావడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి నష్టాన్ని సమగ్రంగా అంచనా వేసి, తగిన పరిహారం అందించి తమకు న్యాయం చేయాలని బాధిత రైతు కొండి కొమరయ్య ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక రైతులు, గ్రామస్తులు కూడా బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తక్షణ ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.