ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి
దుక్కి దున్నేందుకు వెళ్తుండగా ప్రమాదం..
జయశంకర్ భూపాలపల్లి/మహబూబాబాద్ (విజయక్రాంతి): పొలం దున్నేందుకు ట్రాక్టర్ తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఫల్టీ కొట్టి రైతు దుర్మరణం పాలైన ఘటన భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) గణపురం లక్ష్మారెడ్డి పల్లి గ్రామంలో సోమవారం జరిగింది. ఈ ఘటనలో రైతు వొద్దుల రాంరెడ్డి(46) అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ రేఖ అశోక్(SI Rekha Ashok) కథనం ప్రకారం... సోమవారం ఉదయం రాంరెడ్డి తన వ్యవసాయ భూమిలో నారు మడి దున్నెందుకు తన ట్రాక్టర్ తీసుకొని వెళుతుండగా ట్రాక్టర్ అదుపుతప్పి ట్రాక్టర్ ఇంజన్ తలకిందులై కావడంతో ట్రాక్టర్ కింది భాగంలో రాంరెడ్డి ఇరుక్కుపోయి మృతి చెందాడు. క్రేన్ సహాయంతో ట్రాక్టర్ ను పైకి లేపి మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడు రాంరెడ్డికి భార్య జ్యోతి, కూతురు కుమారుడు ఉన్నారు.






