calender_icon.png 9 September, 2025 | 5:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ షాక్ తో రైతు మృతి

09-09-2025 12:05:40 PM

చేగుంట: ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా(Medak District) చేగుంట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ (32) అనే రైతు తన వ్యవసాయ పొలం సమీపంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్ద జంపర్ కొడుతుండగా షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.