06-02-2026 02:04:11 PM
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి ఫినెహాస్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వెంటనే స్పందించారు. ఆ చిన్నారికి వైద్య చికిత్స చేయించేందుకు తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వెంటనే అధికారులు కుటుంబ సభ్యులతో పాటు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి అధికారులతో మాట్లాడారు. చిన్నారిని ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. అక్కడ చికిత్స ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వారికి తెలియజేశారు. వైద్య సేవలను సులభతరం చేయడానికి లెటర్ ఆఫ్ క్రెడిట్ (LoC) కూడా జారీ చేయబడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.