calender_icon.png 9 September, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామచంద్రపురంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి శంకుస్థాపన

09-09-2025 12:09:06 PM

రామచంద్రపురం,(విజయక్రాంతి): గతంలో గ్రామపంచాయతీ కాలంలో వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ(Underground drainage) వల్ల రోజురోజుకు సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు పలుమార్లు బాధ వ్యక్తం చేశారు. ఈ సమస్యను గుర్తించిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు, రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో జలమండలి అధికారులతో చర్చించి రూ.12 లక్షల నిధులు మంజూరు చేయించారు. 

మంగళవారం స్థానిక ప్రజల సమక్షంలో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, "ముందుగా డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, అనంతరం సీసీ రోడ్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తాం" అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హబీబ్ భాయ్, మైనార్టిటీ అధ్యక్షులు హబీబ్ జానీ, పీటర్ పాల్స్, మాజీ ఏఎంసి డైరెక్టర్ ఐలాపూర్ ఐలేష్, రాంజీ, సామ్రాట్, కృష్ణ, వివేక్, శ్రీనివాస్, రఫీ, జియ్యారి కుమార్, రమేష్, సుంకు స్వామి, రాజు, రఫీ, షఫీ తదితరులు పాల్గొన్నారు. స్థానికులు మాట్లాడుతూ తమ సమస్య పరిష్కారానికి కృషి చేసిన కార్పొరేటర్ పుష్పనగేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.