ఏసీబీకి చిక్కిన వ్యవసాయాధికారి
28-05-2024 12:05 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 27 (విజయక్రాంతి): ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. దాహెగాం మండల వ్యవసాయాధికారి వంశీకృష్ణ రూ.3౮ వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ కథనం ప్రకారం.. మండలంలోని అయినం గ్రామానికి చెందిన మారుతి ట్రేడర్స్ రెన్యూవల్ కోసం యజమాని చౌదరిశ్యాంరావు వ్యవసాయాధికారి వంశీకృష్ణను కలవగా రూ.3౮ వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో అతను ఏసీబీ అధికారులను సంప్రదించాడు. అధికారుల సూచన మేరకు సోమవారం మధ్యాహ్నం వ్యవసాయశాఖ కార్యాలయంలో డబ్బులను ఏఓకు అందించాడు. వెంటనే అధికారులు రైడ్ చేసి ఏఓను అదుపులోకి తీసుకున్నారు.






