బీడీ కార్మికుల సంబురాలు
నిర్మల్/నిజామాబాద్, మే 27 (విజయక్రాంతి): యాజమాన్యాలు వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సోమవారం నిర్మల్‌లో సంబురాలు నిర్వహించారు. సోఫినగర్ బీడీ ఫ్యాక్టరీ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొన్నారు. ఐఎఫ్‌టీయూ పోరాట ఫలితంగానే కార్మికులకు వేతనాలు పెంచాయని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి రాజన్న అన్నారు. దీంతో నిర్మల్ జిల్లాలో సమారు లక్ష మందికి ప్రయోజనం కలగనుందని తెలిపారు. సంబురాల్లో బీడీ కార్మికుల సంఘం నాయకులు లక్ష్మణ్, లక్ష్మి, గంగామణి, చిన్నయ్య, రవి, కమల, కవిత పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లాలో..
బీడీ కార్మికులకు వేతనాల పెంపుపై తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం, బీఎల్‌టీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ముబారక్‌నగర్, దేశాయి, నవిపేట్, నందిపేట్, మోస్రా, జన్నేపల్లిలో ఉన్న వివిధ కంపెనీల బీడీ సెంటర్లలో కార్మికులు, ఉద్యోగులు సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బహుజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములును సన్మానించారు.






