10 July, 2026 | 9:21 AM

సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ఆందోళన

10-06-2024 05:07 PM

మంచిర్యాల, విజయక్రాంతి : తమ సమస్యలు పరిష్కరించాలంటూ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నాయకులు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు సోమవారం ఆందోళన నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పడాల రామన్న మాట్లాడుతూ... 50 సంవత్సరాలు నిండినప్రతి కార్మికునికి నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, సాధారణ మరణం చెందుతే రూ 6 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 15 లక్షల రూపాయలు ఇవ్వాలని, వెల్ఫేర్ బోర్డులో బోగస్ కార్డులను వేరు వేయాలని, పనిముట్ల కొలుగోలుకు ప్రతి కార్మికులకి 10 లక్షల లోన్ ఇవ్వాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  మంచర్ల సదానందం, జిల్లా కోశాధికారి చెడి అశోక్, జిల్లా ప్రచార కార్యదర్శి దోరిశెట్టి శ్రీనివాస్, వెంగళ గణేష్, ఆసం అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు గుండా లచ్చన్న, జిల్లా సలహాదారులు శెట్టిపల్లి కోటయ్య,మంచిర్యాల్ పట్టణ అధ్యక్షులు మల్క చంద్రయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి చింతల మల్లేష్, తన్నేరు మల్లేష్ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి సూరన్నతో పాటు 300 పైగా కార్మికలు పాల్గొన్నారు.