30 August, 2026 | 12:19 AM

Breaking News

ఫారంపాండ్ల పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •   దశదిన కార్యక్రమంలో నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్   •   స్నేహితుడి కుటుంబానికి 1996 బ్యాచ్ ఆపన్నహస్తం   •   కనుగుట్ట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా: ఎంపీ జి.నగేష్   •   గోపాల్‌పేట్‌లో పచ్చదనం పరిమళించాలి   •   నాచారం పోలీస్ స్టేషన్ సందర్శించిన చైతన్య స్కూల్ విద్యార్థులు   •   కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి వెళ్లిన వర్గవిబేధాలు   •   దోమకొండ సింగల్ విండో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం   •   రాత్రిపూటా ఆర్టీసీ రయ్ రయ్   •   అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు   •  

ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతుల ఆందోళన

13-11-2024 12:26 PM

కామారెడ్డి జిల్లా కల్లూరులో రైతుల రాస్తారోకో

కామారెడ్డి (విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు జాప్యాన్ని నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ మండలం కల్లూరులో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి 8 రోజులు అవుతున్న ధాన్యాన్ని కాంట పెట్టడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడమే అధికారులు ఆలస్యంగా చేశారని ఇప్పుడు ధాన్యం కాంట పెట్టేందుకు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతుల ఆరోపించారు. వెంటనే కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ  రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు పోచయ్య, మధు పటేల్, బాలు గుండ, తీరుగొండ, భాస్కర్, బాల బోయి తదితరులు పాల్గొన్నారు.