30 August, 2026 | 12:39 AM

గోపాల్‌పేట్‌లో పచ్చదనం పరిమళించాలి

30-08-2026 12:06 AM

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని గోపాల్‌పేట్ గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో 1500 ఈత మొక్కలను నాటారు.పచ్చదనం పెంపొందించడంతో పాటు ఈత చెట్లను సంరక్షించి వాటి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు,గౌడ సంఘం నాయకులు కలిసి మొక్కలు నాటారు.

నాటిన మొక్కలను సంరక్షించడంతో పాటు మరిన్ని మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో గంగాధర్,ఎంపీఓ ప్రభాకర్ చారి,ఎక్సైజ్ సీఐ షాకీర్ హైమద్, గోపాల్‌పేట్ గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి సలీం,గౌడ సంఘం సభ్యులు శ్రీనివాస్ గౌడ్, సంతోష్ గౌడ్, మచ్చేందర్ గౌడ్, సాయగౌడ్, యాద గౌడ్ ఫీల్డ్ అసిస్టెంట్ పృథ్వీరాజ్, తదితరులు పాల్గొన్నారు.