calender_icon.png 17 May, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు పిట్టల్లా రాలిపోతున్నా చలనం లేదు

07-10-2024 01:49:50 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఒకేరోజు ముగ్గురు రైతులు బలి అయ్యారని, రైతు వ్యతిరేక రేవంత్ సర్కారే ఇందుకు కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ  ఓవైపు సాగు నీటి సంక్షోభంతో రైతు లు అల్లలాడుతుంటే, మరోవైపు రుణమాఫీ పేరుతో ద్రోహం చేశారన్నారు. రైతు భరోసా ఊసే లేదని, కౌలు రైతులకు సాయం ఏమైందని ప్రశ్నించా రు. వందలాది మంది రైతులు పిట్టల్లా రాలిపోతున్న సీఎం రేవంత్‌రెడ్డికి చలనం లేదని, ప్రభుత్వానికి బాధ్యతలేదని మండిపడ్డారు.