సాగు రైతుల సంబురం
- ఏడు దశాబ్దాల నిరీక్షణకు తెర
- దొరల భూములపై రైతులకే హక్కులు
- తొలి విడతలో 1,061 మంది రైతులకు 1,044 ఎకరాల పట్టాలు
- నూతనకల్, మద్దిరాల మండలాల్లో రైతులకు పట్టాల పంపిణీ
- పట్టాలు పొందిన రైతుల ఇండ్లలో ఆనందహేళ
- ప్రజాప్రభుత్వానికి కృతజ్ఞతల వెల్లువ
సూర్యాపేట / నూతనకల్, ఆగస్టు ౩౦ (విజయక్రాంతి) : తరతరాలుగా సాగు చేసుకుం టున్న భూమిపై హక్కుల కోసం నిరీక్షిస్తున్న పేద రైతుల కల ఎట్టకేలకు సాకారమైంది. నూతనకల్, మద్దిరాల మండలాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సీలింగ్ భూ ముల సమస్యకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పరిష్కారం చూపింది. వేల మంది రైతుల 70 ఏండ్ల నిరీక్షణకు తెర దింపింది.
అసలు సమస్య ఇది :
నూతనకల్ మండలంలోని తొమ్మిది గ్రామాలు, మద్దిరాల మండలంలోని ఆరు గ్రామాల పరిధిలో పేద రైతులు డ్భె ఏండ్ల క్రితం దేశముఖ్ ల నుండి వేల ఎకరాలను వేల మంది రైతులు కొనుగోలు చేశారు. నా టి నుండి ఈ భూములను సాగు చేసుకుంటున్నారు. గత రెవెన్యూ రికార్డుల్లో కబ్జాదా రులుగా ఈ రైతుల పేర్లే ఉన్నాయి. అయితే గత ప్రభుత్వం ధరణి పోర్టల్ అమలులోకి తెచ్చిన తరువాత అనుభవదారుల వివరా లు నమోదు కాకపోవడంతో అసలు ఈ రై తులకు రికార్డులలో స్థానమే లేకుండా పో యింది.
దీంతో దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూములకు అస లు ఆధారమే లేకుండా పోయింది. దీంతో రైతులకు అసలు సమస్య ప్రారంభమైంది. రైతులు పట్టాదారు పాస్పుస్తకాలు, పంట రుణాలు, రైతు భరోసా, రైతు బీమా తదితర ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమయ్యారు. వెరసి వేల మంది రైతులు ఆందోళనకు గురయ్యారు.
ఎమ్మెల్యే చొరవతో సమస్య ప్రభుత్వం దృష్టికి :
ఏడు దశాబ్దాల కాలంగా సాగు చేస్తూ అనుభవిస్తున్న భూమికి గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో ఎటువంటి ఆధారాలు లేకుండా పోయిన రైతులు తమ సమస్యను తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు వద్ద విన్నవించుకున్నారు. ఎలాగైనా తమ సమస్యను పరిష్కరించి సాగు చేస్తున్న భూ మికి పట్టాలు ఇప్పిస్తే ప్రభుత్వం నుండి రైతులకు అందజేసే అన్ని పథకాలకు తాము అర్హ త సాధిస్తామని, తప్పక తమ సమస్యను పరిష్కరించాలని వేడుకొన్నారు.
దీంతో రైతుల బాధలు అర్థం చేసుకున్న ఎమ్మెల్యే సామేలు ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చించి ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు స్పందించి పూర్తిస్థాయిలో పరిశీలనలు చేసి దొరల భూ ములను వాస్తవికంగా సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇచ్చి వారి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
2960 ఎకరాలపై సమగ్ర సర్వే :
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో 16 ప్ర త్యేక రెవెన్యూ బృందాలను ఏర్పాటు చేశా రు. అధికారులు నెల రోజులపాటు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ప్రస్తుతం భూము లను ఎవరు సాగు చేస్తున్నారు, ఎంత విస్తీ ర్ణం వారి ఆధీనంలో ఉంది, భూమిపై వివాదాలు ఉన్నాయా అనే వివరాలను సేకరిం చారు.
నూతనకల్ మండలంలోని 187 సర్వే నంబర్లలో సుమారు 1,883 ఎకరాలు, మద్దిరాల మండలంలోని 127 సర్వే నంబర్లలో సుమారు 1,077 ఎకరాలుమొత్తంగా దాదా పు 2,960 ఎకరాల భూమిని పరిశీలించా రు. రైతులకు నోటీసులు జారీ చేసి, వారి స మక్షంలో పంచనామాలు నిర్వహించిన అ నంతరం అర్హుల జాబితాను రూపొందించారు.
1061 మంది రైతులకు పట్టాలు
తొలి విడతగా అర్హత నిర్ధారణ పూర్తయిన 1,061 మంది రైతులకు 1,044 ఎకరాలపై పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన భూము ల విషయంలో వివాదాలు, రికార్డులు, అర్హతలను పరిశీలించిన తరువాత తదుపరి చర్య లుతీసుకోనున్నట్లు అధికాలు చెబుతున్నారు.
రైతుల ఇండ్లలో ఆనందహేళ
ఏడు దశాబ్దాలుగా సాగు చేస్తూ కేవలం కబ్జాదారుల కాలంలో మాత్రమే పేరు నమో దు కాగా.. గత ప్రభుత్వం ధరణిలో కబ్జాదారుల కాలాన్ని తీసివేయడంతో ఈ రైతులకు రికార్డులలో అసలు స్థానమే లేకుండా పో యింది. దీంతో ప్రస్తుత ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని సదుద్దేశంతో అన్ని రకాల పరిశీలనలు చేసి శనివా రం రోజున నూతనకల్, మద్దిరాల మండలాల్లోని 1061 మంది రైతులకు పట్టాదారు పు స్తకాలను మంత్రులు పొంగులేటి శ్రీనివా స్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎం పీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేతుల మీదు గా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సమక్షంలో అందజేశారు. దీంతో పట్టా పుస్తకాలు పొందిన రైతుల ఇండ్లలో ఆనందం నిండిపోయింది. తమకు పట్టాలు ఇప్పించేందుకు కృషిచేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మం దుల సామేలు, పట్టాలు ఇచ్చిన ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పట్టాలు లేక పథకాలు కోల్పోయాం..
ఏండ్ల తరబడి భూమి సాగు చేసుకుంటున్నా ఇన్నేళ్లుగా పట్టాలు లేక ప్రభుత్వ పథకాలు కోల్పోయాము. గతంలొ ధరణి లోపాలతో ఆందోళన చెందగా.. ప్రస్తుత ప్రభుత్వం, ఎమ్మెల్యే మందుల సామేల్ చొరవతో మాకు శాశ్వత పట్టాలు దక్కాయి. మా గోడును గుర్తించి హక్కులు కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు
జటంగి సతీష్, రైతు, శిల్పకుంట్ల
ఈ ప్రభుత్వానికి మా కుటుంబం రుణపడి ఉంటుంది
నాకు 60 ఏళ్లు దాటినా మా భూమి కి పట్టా లేక ద శాబ్దాలుగా ఎ న్నో ఇబ్బందు లు పడ్డా ము. రేవంత్ రెడ్డి గారి ప్రభు త్వం, ఎమ్మెల్యే మందుల సామేల్ ప్ర త్యేక చొరవతో ఎట్టకేలకు మాకు పట్టా లు అందాయి. మా దశాబ్దాల కలను సా కారం చేసిన ప్రజా ప్రభుత్వానికి మా కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉం టుంది.
పసుల లింగయ్య, రైతు, ఎర్ర పహాడ్ నూతనకల్ మండలం






