జీడీకే ఇన్‌క్లువ్‌లో రూఫ్ ఫాల్
31-08-2026 12:57 AM
- భారీగా కూలిన బొగ్గు పెళ్లాలు
- కుప్పకూలిన సీఎం మెషిన్?
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- ప్రకటించని సింగరేణి యాజమాన్యం
గోదావరిఖని, ఆగస్టు 30 (విజయక్రాం తి): పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని జీడీకే-11 ఇన్‌క్లున్‌లో ఆదివారం సెకండ్ షిఫ్ట్‌లో ప్ర మాదం చోటుచేసుకుంది. సీఎం సెక్షన్ లో అకస్మాత్తుగా రూఫ్‌ఫాల్ కావడంతో భా రీగా బొగ్గు పెళ్లాలు కూలిపోయినట్లు సమాచారం. రూఫ్‌ఫాల్ తీవ్రతకు బొగ్గు పెళ్లాలు కూలి సీఎం మెషిన్ పూర్తిగా కుప్పకూలినట్లు తెలుసింది. ఘటన సమయంలో సెక్షన్‌లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితిపై వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, సింగరేణి యాజమాన్యం పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సహా యక చర్యలు కొనసాగుతున్నాయా? ఘటనలో ఎవరైనా కార్మికులు చిక్కుకున్నారా? గాయాలయ్యాయా? అనే విషయాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.






