calender_icon.png 4 December, 2024 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డుపై వడ్లతో రైతుల ఆందోళన

04-11-2024 12:03:13 AM

కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్

సిరిసిల్ల, నవంబర్ 3 (విజయక్రాంతి): పదిహేను రోజులుగా ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా కొనుగోళ్లు చేపట్టడంలేదని రోడ్డుపై వడ్లు పోసి రైతులు ఆందోళనకు దిగారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో సిరిసిల్ల రహదారిపై బైఠాయించారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.