30 June, 2026 | 9:05 PM

Breaking News

ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •   రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •  

ధైర్యంగా ఉండండి ఆందోళన వద్దు

05-05-2026 08:44 PM

ప్రభుత్వం నుండి పరిహారం అందేలా కృషి చేస్తా ఎమ్మెల్యే

బోథ్,(విజయక్రాంతి): అగ్ని ప్రమాదంలో కనుగుట్ట గ్రామ రైతులకు తీరని నష్టం సంభవించిందని నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదని అయితే తాను రైతులకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని స్థానిక శాసనసభ్యులు అనిల్ జాదవ్ పేర్కొన్నారు. రైతులు  ధైర్యం కోల్పోవద్దని తాను అండగా ఉంటానన్నారు. రైతులకు జరిగిన పంట నష్టం విషయమై జిల్లా కలెక్టర్కు వివరించడం జరిగిందన్నారు.

అంతేగాక ప్రభుత్వానికి సహితం ఈ విషయాన్ని తెలుపమన్నారు. దురదృష్టకరమైన ఈ సంఘటన వల్ల రైతు జీవితాలు అంధకారంగా మారుతున్నాయని వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతులకు ప్రభుత్వపరంగా ఎంత చేసినా తక్కువనేనని పేర్కొన్నారు. ఆయన వెంట మాజీ జెడ్పిటిసి సంధ్యారాణి మాజీ ఎంపీపీ కుల శ్రీనివాస్ మండల పార్టీ కన్వీనర్ ఎల్కరాజు యూత్ అధ్యక్షులు ప్రవీణ్ తోపాటు కనుగుట్ట గ్రామ రైతులు ఉన్నారు