5 May, 2026 | 9:54 PM

నిజాంసాగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ప్రజాపండరి

05-05-2026 08:40 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా  వడ్డేపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రజా పండరి నీ నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసినట్లు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్ తెలిపారు.

పార్టీ కోసం కష్టపడే వారికి సరైన సమయంలో తప్పకుండా పదవులు వరిస్తాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు ఆశీస్సులతో  మండల పార్టీ అధ్యక్షునిగా  ఎన్నికైనందుకు జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు, డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జునులకు, నిజాం సార్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నికైన ప్రజా పండరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.