12 June, 2026 | 1:13 AM

ఎమ్మెల్యే విజయ రమణారావును సన్మానించిన రైతులు

12-06-2026 12:00 AM

సుల్తానాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): రెండు మాసాలుగా సాగిన వరి ధాన్యం సేకరణ ప్రక్రియను రైతులకు ఎలాంటి ఇబ్బందులు, నష్టాలు కలగకుండా అత్యంత విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను గురువారం ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు ను సుల్తానాబాద్ రైతులు ఘనంగా సన్మానించారు.  రైతులు, రైతు ప్రతినిధులు ఎమ్మెల్యేకి పూలమాలలు వేసి, శాలువా కప్పి, కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎమ్మెల్యే  తన భుజాలపై వేసుకొని రాత్రింబగళ్లు శ్రమించారని కొనియాడారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న శాసనసభ్యులకు నియోజకవర్గ రైతాంగం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, రైతు నాయకులు గేల్లు కొమురయ్య, పల్లె నల్ల ముత్యాలు, జునగరి భూమయ్య, గిర్గుల ప్రభాకర్, మ్యారవేణి లక్ష్మయ్య, జునగిరి చంద్రయ్య , సహకార సంఘాల అధ్యక్షులు, మార్కెట్ కమిటీల ఛైర్మెన్స్ రైతులు పాల్గొన్నారు.