టైలకు రూ.100 కోట్లా!
- ప్రభుత్వ విద్యార్థులకు ‘టై’ల సరఫరా
- మూడేళ్ల కాలానికి సంక్షేమ శాఖల టెండర్లు
- ఏటా రూ.35 కోట్ల చొప్పున ఖర్చు
- ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు
- వృథా ఖర్చంటున్న మేధావులు, విద్యావంతులు
- నాణ్యమైన భోజనం, వసతుల కల్పనకు వినియోగించాలని సూచన
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, రెసిడెన్షియల్ పా ఠశాలలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు ‘టై’ల పంపిణీ కోసం భారీ వ్యయానికి ప్రభుత్వం సిద్ధమైంది. మూడేళ్ల పాటు టైలు సరఫరా చేసేందుకు గాను దాదాపు రూ. 100 కోట్ల విలువైన టెండర్లు ఆహ్వానించిం ది. వకేవలం ‘టై’ల కోసం ఇంత భారీ మొత్తా న్ని వెచ్చించడంపై మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అవసరానికంటే ఆర్భాటానికే ప్రాధాన్యమిస్తున్నార న్న విమర్శలు వినిపిస్తున్నాయి.
30 లక్షల మందికిపైగా విద్యార్థులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల ప్రభు త్వ పాఠశాలల్లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి యూనిఫాం, షూ, సాక్స్‌లతో పాటు మెడలో ధరించడానికి ‘టై’ లు కూడా ఇవ్వాలని ప్రభు త్వం నిర్ణయించింది. అం దుకోసం ‘టై’ల సరఫరాకు ఆయా శాఖల ఆధ్వర్యంలో టెండర్లు పిలిచారు. ఒక టై రూ. 110 నుంచి రూ.120లకు సరఫరా చేసేలా టెండర్లు పిలిచారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం విద్యార్థులకు ఏటా రూ.30 నుంచి రూ. 35 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. ఇలా మూడేళ్లలో రూ.100 కోట్ల వ్యయం కానుంది.
ఇతర సమస్యలూ తీర్చవచ్చు
‘టై’ల కొనుగోలుకు ప్రభుత్వం భారీ మొత్తంలో ఖర్చు చేయనున్న నేపథ్యంలో వివిధ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. చాలా పాఠశాలల్లో నేటికీ మూత్రశా లలు లేవని, ఇతర మౌలిక వసతులు లేవని, రూ.100 కోట్లతో ఆ సమస్యలు తీర్చవచ్చని సూచిస్తున్నారు. అలాగే అల్పాహారం, మ ధ్యాహ్న భోజనాన్ని మరింత పోషకాలతో అందించవచ్చని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కంప్యూటర్ల ను కొనుగోలు చేసి, విజ్ఞానాన్ని అందిస్తే భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూ రుతుందని అంటున్నారు.
వంద ల స్కూళ్లలో ఇప్పటికే సరిపడా తరగతి గదులు లేవు. టైలకు వెచ్చించిన నిధుల్లో కొంత మొత్తం కేటాయిస్తే తరగతి గదుల నిర్మాణం పూర్తవుతుందని, అలాగే క్రీడా సామగ్రి కొనుగోలు చేసి విద్యార్థులను ఆ రంగంలో కూడా ప్రోత్సహించవ చ్చని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని చెబుతున్న ప్ర భుత్వమే.. కేవలం ‘టై’లకు ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేస్తుండటం.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని పేర్కొంటున్నారు.






