2 July, 2026 | 1:15 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

సమీకృత వ్యవసాయం ద్వారా అధిక రాబడి

06-03-2026 07:35 PM

- భువనగిరి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త శ్రీలత

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు అదనపు రాబడిని పొందవచ్చని భువనగిరి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త  శ్రీలత అన్నారు. నారాయణపురం గ్రామంలోని రైతు వేదికలో ఆత్మ  సౌజన్యంతో రైతులకు సమీకృత వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి పూజ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీలత  మాట్లాడుతూ... వరిలో యాజమాన్య పద్ధతులు, సేంద్రియ వ్యవసాయం, నాచురల్ ఫార్మింగ్, నానో యూరియా, ఆయిల్ ఫామ్, వరిలో మంచి విత్తనాలు గురించి రైతులకు వివరించారు. మండల వ్యవసాయ అధికారి పూజ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం, వివిధ రకాల పంటలు యాజమాన్య పద్ధతులు వివిధ పంటల సాగులపై రైతులకు వివరించారు. రైతుల సందేహాలను ఈ సందర్భంగా నివృతి చేశారు.  ఈ కార్యక్రమంలో  ఏఈవోలు సైదులు, శివ, స్వప్నిక, శశిబిందు, అనురాధ, సీఆర్పీలు, రైతులు, డీలర్లు పాల్గొన్నారు.