ప్రతి ధాన్యపు గింజను కొంటాం..
రైతులు ఆందోళన చెందొద్దు
కేంద్రం ఆదేశాలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తాం:
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హనుమకొండ, మే 28 (విజయక్రాంతి): రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అధికారులు సమన్వయం చేసుకుంటూ, వరి ధాన్యాన్ని గోదాల్లోకి తరలించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో గురువారం వరి ధాన్యం కొనుగోలు పై ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు, ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 4లోపు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
ధాన్యం తరలించేందుకు అందుబాటులో ఉన్న రవాణా వ్యవస్థలన్నింటిని ఇసుక లారీలు, డిసిఎంలు, ఇతర రవాణా వాహనాలన్నింటిని రానున్న వారం రోజుల పాటు ధన్యం రవాణాకే ఊయోగించాలని అధికారులకు సూచించారు. ఎట్టిపరిస్థితుల్లో జూన్ 4లోపు ధాన్యం కొనుగోలు, రవాణా పూర్తి కావాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన ఎమ్మెస్పీ కంటే అధికంగా పంట దిగుబడులు వచ్చాయని, ఎంత ఖ్చనా రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.
జనగామ, హనుమకొండ, వరంగల్ తదితర జిల్లాల కలెక్టర్ల నుండి వరి, మక్కల సాగు, దిగుబడి ల గు రించి తెలుసుకున్న మంత్రి జూన్ 4 లోపు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిలువలను త్వరగా గోడౌన్లోకి సరఫరా చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫిన్ రవీంద్ర, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కూడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హన్మకొండ, వరంగల్, జనగామ, ములు గు జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లై అధికారు లు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ అధికారు లు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.






