దొరగారి ఆలికి అందలం..?
- అమ్మగారి పోస్టింగ్ జీఎం ఆఫీస్ లోకి
- అధికార దుర్వినియోగం బట్టబయలు
- ఇది విజిలెన్స్ కు కనిపించడంలేదా?
- సామాన్యుల కో రూల్, దొరలకో రూలా..?
మందమర్రి (బెల్లంపల్లి), మే 28 : సింగరేణిలో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగు తుంది. ’అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో ’అన్న చందంగా కొందరు అధికారుల తీరుపై విమర్శలు గుప్పుమంటు న్నాయి. ఇదెక్కడో కాదు సాక్షాత్తు మందమర్రి జీఎం ఆఫీసులో ఓ కీలక పోస్టులో ఉన్న అధికారి లీలలు వెలుగులోకి వచ్చా యి. మందమర్రి ఏరియాలో సెక్యూర్టీ విభాగంలో ఓ మహిళా పనిచేస్తున్నది. అప్పటికి ఆమెకు వివాహం కాలేదు. ఇటీవలనే ఆమె కు అదృష్టం కలిసొచ్చింది. పర్సనల్ విభాగంలో కీలక మైన పోస్టులో ఉన్న ఓ ఉన్న తాధికారితో వివాహం అయ్యింది. ఇక పెండ్లి తో ఆమె దశ తిరిగింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ లేదన్నట్టు.. అప్పటి వరకు అందరిలా సదరు ఉద్యోగిలా కనిపించినా ఆమె ఆఫీసరు సతీమణికావడంతో ప్రమోషన్ వచ్చినంత పనైంది. దీంతో ఆమె పని స్థలం మారిపోయింది.
ఏకంగా జీఎం ఆఫీసులోకి ఆమె విధులు బదలాయింపు జరిగి పోయాయి. అప్పటివరకూ అందరిలా సా మాన్యమైన ఉద్యోగి ఆమె. అధికారులు ఏమిచెప్పినా చేసేది. జనరల్ మజ్దూర్ మహి ళా ఉద్యోగులు అధికారులకు సర్వెంట్లు మారిపోయారు. ఛాయ్ ఇవ్వడం, ఆఫీసులను సుబ్రపర్చడం నిత్యం కనిపించే వారి శ్రమైక దృశ్యాలివీ. సింగరేణిలో కింది స్థా యి మహిళా ఉద్యోగులు చేసే పనులివి. ఆఫీసుల్లో అధికారులకు ఫైళ్ళు ఇవ్వడం కూడా చూస్తుంటారు. ఎంత ఉన్నత విద్యావంతులైనా కిందిస్తాయి మహిళలు అటెండర్ గానే పనిచేస్తుంటారు. వారి పని అర్హత అదన్నమాట. ఇవి సామాన్య కార్మికుల పిల్లల ఉద్యోగులు ఇప్పటివరకూ చేస్తున్న పనులు. అదే అధికారులకు సంబంధిత బంధువులకు ఆ పరిస్థితి ఉండదు. అధికారం చేతిలోఉంటే లగ్జరీ గా బ్రతుకచ్చు.
అధికారుల లీలలు..?
జీఎం ఆఫీస్ లో పర్సనల్ అధికారుల వి న్యాసాలు అంతా ఇంతాకాదూ.. అన్ని తానై పోయారు. తానే రాజు, తానే మంత్రి అన్న ట్టు అక్కడ అయనదే హవా నడుస్తుంది.. ముఖ్యంగా క్వార్టర్ల కేటాయింపులో ఆయన చేతివాట రుచిచూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పైకి మాత్రం ఈ విషయంలో నా అంత సిన్సియర్ లేడని కల రింగ్ ఇవ్వడంలో ఆయనకి మించిన వారేలేరు. తనకు నచ్చిన వాళ్ళకి నో రూల్స్, అదే నచ్చని వాళ్ళకి బోలెడు రూల్స్ చెపుతాడు.. ఒక కార్మికుడు సంవత్సర కాలంగా క్వార్టర్ కోసం జీఎం ఆఫీస్ చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నాడు.
అస్సలు పట్టించుకోవడంలేదు. ఆ కార్మికునీపై ఒక లేడీ ఆఫీసర్ ఏదో చెప్పిన తప్పుడు సమాచారంతో దాన్ని మనసులో పెట్టుకొని ఆ కార్మికుడిపై కక్ష సాధిం పుకుగా తప్పుకుంటున్నారని తెలుస్తోంది. సదరు కార్మికునికి క్వార్టర్ ఎలిజిబులిటీస్ ఉన్న.. రూల్స్ అంటూ క్వార్టర్ రాకుండా చే శాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మం దమర్రి లో తన చుట్టూ ఎందరో ఇల్లీగల్ క్వార్టర్ లో నివాసం ఉంటున్నారు. ఆయన అంత నిజాయితీ అధికారే అయితే రూల్స్ ప్రకారం క్వార్టర్లు అలాట్మెంట్ జరిగితే..
పదు ల కొద్ది ఇల్లీగల్ గా ఎలా నివాసా ల్లో ఉంటారనీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారిపై ఇంతవరకు చర్యలు లేవు. ఎందుకం టే ఆయన కు తెలియకుండా జరిగినవి కావు కనుక చర్యలు ఉండవుకదా.. పైగా అలాంటి అక్రమాలతో తనకెలాంటి సంబంధం లేద ని పైకి మాత్రం బుకాయిస్తున్నారు. నిజంగా క్వార్టర్ల అక్రమ కేటాయింపుల్లో తన పాత్ర లేకుంటే వాటిపై ఎం దుకు చర్యలు తీసుకోవడంలేదన్నది అందరిని వేధిస్తున్న ప్రశ్న.
గత మూడు నెలల క్రితం ఓ కార్మికుడితో క్వా ర్టర్ విషయమై ఒప్పందం చేసుకున్నట్టు ప్ర చారం జోరుగా ఉంది. నోటీస్ బోర్డ్ లోపెట్టిన క్వార్టర్ నం బర్ ని కౌన్సెలింగ్ సంద ర్భంగా ఆ నంబరు ను తొలగించి మంత్రి రికమండేషన్ లెటర్ తో సదురు కార్మికునికి క్వార్టర్ మంజూరు చేశారనీ సమాచారం. ఒక నెల కిందట తన వివాహం.. కాకముందు తన భార్య సెక్యూరిటీ గారడ్స్ గా వివిధ చో ట్ల విధులు నిర్వహించేది. వివాహం తరువా త ఆమె ఏకంగా జీఎం ఆఫీసు లోని సెక్యూరిటీ ఆఫీసులోకి షిఫ్టు అయ్యారు.
ఈ విష యంలోఅక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులు, కార్మికులు జూనియర్ ని జీఎం ఆఫీ సు సెక్యూర్టీ ఆఫీసులోకి ఎలా మార్చుతారని ఆ సిన్సియర్ అధికారిని నిలదీశారని తెలుస్తోంది. అందుకు ఆయన సమాధానం చెప్ప లేక ఆ సంగతిని జీఎం పైకి నెట్టివేశారు. కా ర్మికులను జీ ఎం పేరుతో పరోక్షంగా దబాయించాడు. ఈ నేపథ్యంలో సదరు అధికారి విధి నిర్వహణలో ఆశ్రిత, పక్షపాతం,అవినీతి, నిబంధనల ఉల్లంఘన స్పష్టంగా బట్టబయ లు అయ్యింది.
జీఎం ఆఫీసు లో పర్సనల్ విభాగం అధికారి వ్యవహారంపై జోరుగా చ ర్చ జరుగుతోంది. అదికాస్తా జీఎం పరిపాలతీరుపై కూడా ప్రభావం చూపుతుందనీ తె లుస్తోంది. వివాదాస్పదంగా మారిన ఆయ న తీరుపై జీ ఎం దృష్టి ఇప్పటికీ పడకపోవడం ఒకింత అందరినీ ఆశ్చర్యo కలిగిస్తు న్నది. విమర్శలకు కేంద్ర బిందువుగా ఆయ న దూకుడు వెనుక ఎవరి అండదండలు లేకుండానే ఇలా రెచ్చిపోతిన్నారా? అన్న అ భిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దీంతో ఆయన చేష్టలకి పట్టపగ్గాలు లేకుండా పో యాయన్న విమర్శలు వ్యక్తం అవుతున్నా యి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఆయన పనితీరులో మార్పుకోసం ప్రక్షాళన పై దృష్టి పెట్టాలని కార్మికులు కోరుతున్నారు. అధికారులు ఏమిచేస్తున్నారు.. ఎలా పనిచేస్తు న్నారనే విషయం పై ఉన్నతాధికారులు ఓ కన్నెసి పెట్టడం అవసరమే...






