గొల్లాపూర్ గొంతు ఎండుతోంది
- వారం రోజులుగా సరఫరాలేని భగీరథ నీరు..
- గ్రామంలో మొరాయించిన బోర్ బావి
బోథ్, మే 28 (విజయక్రాంతి) : సోనాల మండలం లోని మారుమూల ఆదివాసీ గ్రా మమైన గొల్లాపూర్ లో మంచినీరు అందక గ్రామస్తుల గొంతు ఎండుతోంది. గత వా రం రోజుల నుండి త్రాగునీరు సరఫరా లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో గ్రా మంలో ఉన్న ఒకే ఒక్క బోరుబావి వద్ద నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్నది. అయితే ఆ బోరు బావి సహితం మూ డు రోజుల నుండి పని చేయకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న భావి వద్దకు వెళ్లి త్రాగునీటిని తెచ్చుకుంటున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బావిలో సైతం నీటి కలుషితం ఉందని ఆ నీటిని తాగి తే వ్యాధులు వచ్చే విధంగా ఉన్నాయని అం టున్నారు.
మిషన్ భగీరథలో పని చేస్తున్న కొంత మంది సిబ్బంది తమకు వేతనాలు రాకపోవడంతో నీటి సరఫరా నిలిపివేశామని అం టున్నట్లు గ్రామానికి చెందిన ఆదివాసీలు వాపోయారు. పశువులకు గ్రామం సమీపంలోని వాగులో నీటిని తాపుతున్నామని, అయితే పశువులు ఆ నీటిని తాగేందుకు ఇష్టపడడం లేదని గ్రామ రైతులు అంటున్నారు. ఏది ఏమైనా జిల్లా మండల స్థాయి అధికారులు తక్షణమే గ్రామంలో ఉన్న నీటి ఎద్దడి తీవ్రతపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.






