18 August, 2026 | 12:28 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

ధాన్యం ఇంకెప్పుడు కొంటరు?

22-05-2026 12:54 AM

చిన్నశంకరంపేట, చేగుంటలో రోడ్డెక్కిన రైతులు

భారీగా ట్రాఫిక్ జామ్

గంజాయి పంటకు అనుమతి ఇవ్వండి 

కామారెడ్డి జిల్లాలో రైతుల ఆగ్రహం 

చిన్న శంకరంపేట/చేగుంట/కామారెడ్డి, మే 21(విజయక్రాంతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా పడికాపు కాస్తున్నా లారీలు రావడం లేదని, ధాన్యం కొనడం లేదని, కొన్నది పోవడం లేదని అధికారులను రైతులు నిలదీశారు. మీరు ధాన్యం కొనుగోలు చేయమంటే పండిన ధాన్యాన్ని చెరువులోనైనా పోసుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిన్న శంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో మెదక్, చేగుంట రహదారిపై రైతులు గురువారం సుమారు రెండు గంటల పాటు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. అలాగే ‘మీరు ధాన్యం కొనలేరని, మాకు గంజాయి పంటకు అనుమతి ఇస్తే.. మీకూమాకూ ఈ అవస్థలు ఉండవు’ అని కామారెడ్డి జిల్లాలో రైతుల అగ్రహించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి వ్యతి రేకంగా నినాదాలు చేశారు.

అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు రోడ్డుపై నుంచి లేచేది లేదని భీష్మంచుకుని కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శివానందం సంఘటనా స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి, ‘రోజూ ఒక లారీ పంపించే బాధ్యత నాది’ అని హామీ ఇచ్చారు. దీంతో  రైతులు ఆందోళన వి రమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యంపై కప్పడానికి తెచ్చిన టాపర్లకే వేల రూపాయలు అద్దె చెల్లిస్తున్నామని, ధా న్యాన్ని ఆరబెట్టిన దానికంటే చెరువులో పోసుకోవడమే మేలని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. వరి ధాన్యం అమ్ముకోవడంలో నెలరోజులుగా పడుతున్న ఇబ్బందు లకు తాళ లేక  కామారెడ్డి జిల్లాలో రైతులు వినూత్న నిరసనలకు దిగుతున్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని అడ్లూరు ఎస్సీ కాలనీలో కొనుగోలు కేంద్రం 2 వద్ద రైతులు నిరసన వ్యక్తం చేస్తారన్న విషయాన్ని అధికారులు పసిగట్టారు. దీంతో జిల్లా సివిల్ సప్లై, స్థానిక రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రానికి వెళ్లి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. 

‘ఇక ధాన్యం పండించం. మీకు ఇ బ్బంది కలిగించం. మాకు గంజాయి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వండి. మీకూ మాకూ ఇబ్బందులు తప్పుతాయి’ అంటూ రైతులు నిలదీయడంతో అధికారులు విస్తుపోయారు. నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ‘మీరు ఎన్ని చెప్పినా.. మా వడ్లు కొనరు. మాకు ఇబ్బందులు తప్పవు’ అంటూ రైతులు ఆగ్రహించా రు. ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్‌కు తరలిస్తామని జిల్లా సివిల్ సప్లై అధికారులు హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు.