18 August, 2026 | 1:24 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

పేదల ఆరోగ్యానికి అండగా ప్రభుత్వం

22-05-2026 12:56 AM

మధిర, మే 21(విజయ క్రాంతి): పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని జవ్వాజి ఆనందరావు అన్నారు. గురువారం పట్టణంలోని రేణుక చౌదరి పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన మహాదేవపురానికి చెందిన కలక జ్యోతికి రూ.60,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జవ్వాజి ఆనందరావు మాట్లాడుతూ.... పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.

ఈ చెక్కు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి సహకారంతో, తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసుతో మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి కర్లపూడి అప్పారావు, మండల నాయకులు ఆవుల గురుబ్రహ్మం, జల్లేపల్లి ప్రసాద్, బాధ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.