4 April, 2026 | 1:22 PM

పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన

04-04-2026 11:44 AM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణంలోనీ శ్రీరంగాపురం(Srirangapuram) గ్రామానికి చెందిన రైతులు మల్లు వెంకట్ రెడ్డి, మల్లు సైదిరెడ్డి, మల్లు యేసు రెడ్డి , వారి కుటుంబ సభ్యులు పురుగుల మందు డబ్బతో ఆందోళనకు దిగారు.శ్రీరంగాపురం గ్రామ శివారులో తాము సాగు చేసుకుంటున్న మూడు ఎకరాల పొలంలో చేతికొచ్చిన పంటను అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్‌తో తొక్కించారని ఆరోపించారు.

ఈ ఘటన లో వెనుక బిక్షమా రెడ్డి ఉన్నాడని పేర్కొంటూ, కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా పంటను నాశనం చేశాడని బాధిత రైతులు వాపోయారు.ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మరో రెండు రోజుల్లో చేతికోచ్చే పోలాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు పురుగుల మందు డబ్బల తో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు  చేతికి వచ్చిన పంట పొలాన్నే తొక్కించారు ఎవరూ లేని సమయంలో మాపై కూడా దాడులు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి పంట పొలాన్ని ట్రాక్టర్లతో తొక్కించిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.