రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
జొన్నల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
జహీరాబాద్/ఝరాసంగం, మే 27: జొన్నల కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆర్‌డీ. మాధురీ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి గ్రామంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జొన్నల కొనుగోలు కేంద్రంలో రిజిస్టర్‌తో పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్న వివరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. తడిసిన జొన్నలను కూడా కొనుగోలు చేయాలని, మద్ధతు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జొన్నల కొనుగోలు చేసిన వెంట నే వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయాలన్నారు. జొన్నల్లో తరుగు పేరిటా రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దన్నా రు. ఆమె వెంట జహీరాబాద్ ఆర్డీవో రాజు, తహసీల్దార్ సంజీవ్‌రావు, ఆర్‌ఐ రామరావు, ఏవో వెంకటేశం, ఏఈవో రేణుక, కొనుగో లు కేంద్రం ఇన్‌చార్జి నిస్సార్ పాల్గొన్నారు.






